సరిహద్దులో ఉగ్రవాదుల సొరంగం

by  |
సరిహద్దులో ఉగ్రవాదుల సొరంగం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-పాక్ సరిహద్దులో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగం బయటపడింది. జమ్ములోని సాంబా సెక్టార్‌లో పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ దళాలు ఈ సొరంగాన్ని గుర్తించారు. అక్రమంగా భారత్‌లో చొరబడేందుకు ఈ సొరంగం ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. దాదాపు సొరంగం పొడవు 20 మీటర్లు మేర ఉన్నట్టు స్పష్టం చేశారు. అయితే, ఇందులో పాక్‌కు సంబంధించిన ఆనవాళ్లు బయటపడటం ఆందోళనకరం.

భారత్-పాక్ సరిహద్దులోనే ఇటువంటి సొరంగం బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో దేశ సరిహద్దు ప్రాంతాల్లో సొరంగాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వెంబడి 3,300 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు అలెర్ట్ అయ్యారు.



Next Story