- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షార్ట్ సర్క్యూట్ కారణంగా జెర్రీ కాటన్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం
<p>దిశ, గోషామహల్ : షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగల్ హాట్ డివిజన్ పరిధిలోని రహీంపుర ఎస్ఎస్‌కే సమాజ్ వద్ద ఉన్న జెర్రీ కాటన్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మంగళ్ హాట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే అగ్ని మాపక […]</p>

దిశ, గోషామహల్ : షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగల్ హాట్ డివిజన్ పరిధిలోని రహీంపుర ఎస్ఎస్‌కే సమాజ్ వద్ద ఉన్న జెర్రీ కాటన్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మంగళ్ హాట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.

కాగా గత కొన్నేళ్లుగా కపిల్ అనే వ్యాపార వేత్త జెర్రీ కాటన్ ట్రేడ్ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. మంగళ వారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికంగా అందుబాటులో ఉన్న మంగళ్ హాట్ కార్పొరేటర్ శశికళ కృష్ణ, సమాజ్ సభ్యులు సురేష్, నగరి సత్యనారాయణ, రవీందర్ సింగ్, వివేక్, సంతోష్ సింగ్, కిషోర్ కుమార్, నితింరాజు లు సకాలంలో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేశారు. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేసిన కృషిని పలువురు అభినందిచారు.






