అగ్నిప్రమాదం.. ఎగిరిపడుతున్న కెమికల్ డ్రమ్ములు

9

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాచేపల్లి మండలం ఇరికేపల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇంతకుముందు ఫ్యాక్టరీలో నిల్వ చేసిన డ్రమ్ములు పేలుతుండటంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే కెమికల్ డ్రమ్ములు పేలుతూ పైకి ఎగురుతుండటంతో సిబ్బందికి ఇబ్బందులు ఎదరవుతున్నాయి.