కామారెడ్డిలో ఘోరం.. కాలి బూడిదైన ఇల్లు

by Shyam |

<p>దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ నివాసం(గుడిసె) ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది. శాంతి నగర్ కాలనీలోని మసీదు వద్దనున్న పూరి గుడిసెలో షేక్ హుస్సేన్ కుటుంబం నివాసముంటోంది. రోజులాగే ఇంట్లో అందరూ ఇవాళ కూడా వారి పనుల నిమిత్తం ఇంటినుంచి బయటకు వెళ్లారు. దీంతో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలి బూడిదైంది. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లోని టీవీ, తిండిగింజలు, వంట సామాగ్రి అన్నీ [&hellip;]</p>

House Burning
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ నివాసం(గుడిసె) ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది. శాంతి నగర్ కాలనీలోని మసీదు వద్దనున్న పూరి గుడిసెలో షేక్ హుస్సేన్ కుటుంబం నివాసముంటోంది. రోజులాగే ఇంట్లో అందరూ ఇవాళ కూడా వారి పనుల నిమిత్తం ఇంటినుంచి బయటకు వెళ్లారు. దీంతో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలి బూడిదైంది. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లోని టీవీ, తిండిగింజలు, వంట సామాగ్రి అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 లక్షల వరకు నష్టం జరిగినట్లు సమాచారం. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Next Story