శృంగార వీడియోలు అడిగిన మైనర్.. ఇచ్చేసిన 250 మంది.. చివర్లో ట్విస్ట్ అదుర్స్

by  |
శృంగార వీడియోలు అడిగిన మైనర్.. ఇచ్చేసిన 250 మంది.. చివర్లో ట్విస్ట్ అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యాపార వేత్త రాజ్ కుంద్రా పోర్న్ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.. మరో పక్క అలాంటి కేసులే రోజుకొకటి బయటపడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితమే మోడల్, నటి నందితా గుప్త సెక్స్ రాకెట్ నడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన విషయం మరవకముందే మరో భారీ సెక్స్ రాకెట్ గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. ఇక ఈ కేసు మిగతావాటిన్నంటికి భిన్నంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. బాధితులకు తెలియకుండానే వారి నగ్న వీడియోలను చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని బెదిరించి డబ్బు గుంజుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ముఠా లో ఒక మైనర్ బాలుడు ఉండడం గమనార్హం.

వివరాలలోకి వెళితే.. ప్రస్తుతం సోషల్ మీడియా వాడని వారుండరు. అందులో అబ్బాయిలకు.. అమ్మాయిల పేరుతో రిక్వెస్ట్ వస్తే ఇక పండగే.. ఈ నేరస్తులు యువకుల వీక్ నెస్ నే తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఫేస్ బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా సైట్లలో డూప్లికేట్ అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. అకౌంట్లలో గుర్తు తెలియని అమ్మాయి ఫొటోలు పెడుతారు. అనంతరం కొంతమంది అబ్బాయిలకు ఆ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అమ్మాయే కదా అని పాపం బాధితుడు రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. దీంతో అబ్బాయి పని ఐపోయినట్టే.. మొదట తీపి తీపి కబుర్లతో వారిని వలలో పడేస్తారు.. ఇలా కొన్ని రోజులు చాటింగ్ చేశాక.. మెల్లగా ప్రేమిస్తున్నట్టుగా డ్రామా ఆడుతారు.

నీతో మాట్లాడాలని.. నీ ఫొటోలు పంపు అంటుంటారు. ఫొటోలు పంపాక నగ్నంగా ఫొటోలు పంపు అంటారు. అమ్మాయే మొదట అడిగేసరికి అబ్బాయిలు కాదనకుండా అలాగే పంపిస్తారు. ఇక అక్కడినుంచి వారికి సమస్య మొదలవుతుంది. వారి నగ్న ఫోటోలు, వీడియోలు ఎప్పుడైతే క్రిమినల్స్ చేతికి వచ్చాయో .. వారి నిజ స్వరూపాన్ని బయటపెడతారు. తమకు కావాల్సిన డబ్బు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, మీ ఇంట్లో వారికి పంపిస్తామని బెదిరించడం మొదలుపెడతారు. ఇలా ఆ ముఠా ఇప్పటివరకు 250 మంది యువకులను బెదిరించి వారివద్ద నుంచి లక్షల్లో డబ్బు గుంజారు. తాజాగా ఒక అబ్బాయిని ఇలాగే మోసం చేద్దామని ప్రయత్నిస్తుండగా.. అతను పోలీసులను ఆశ్రయించడంతో ఈ సెక్స్ రాకెట్ గుట్టు బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ 5గురిలో ఒకరు మైనర్ కావడం పోలీసులను షాక్ అయ్యేలా చేసింది. వారి వద్ద నుంచి 80 అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అకౌంట్లను డిలీట్ చేయించారు.

Next Story

Most Viewed