HYD: ఆంటీతో స్నేహితుడి ఎఫైర్.. వద్దని చెప్పినందుకు హోటల్‌కి పిలిచి..

by  |
HYD: ఆంటీతో స్నేహితుడి ఎఫైర్.. వద్దని చెప్పినందుకు హోటల్‌కి పిలిచి..
X

దిశ, చార్మినార్​ : వివాహితతో ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పిన స్నేహితుడిని కత్తితో విచక్షణ రహితంగా దాడిచేసి గాయపరిచిన ఘటన పాతబస్తీ సంతోష్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. సంతోష్​ నగర్​ పోలీస్​స్టేషన్​ ఎదురుగా నివసించే అక్బర్​ఖాన్​(23) కు రియాసత్​ నగర్​కు చెందిన ఓ వివాహితతో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అక్బర్​కు రియాసత్ ​నగర్​కు చెందిన మహ్మద్​ ఆలీ ఈసా(23) స్నేహితుడు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం వివాహిత భర్త ‘నీ స్నేహితుడు అక్బర్​నా భార్యకు, నాకు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని పద్దతి మార్చుకోమని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని మహ్మద్​ ఆలీ ఈసాను హెచ్చరించారు. ఈ విషయమై అక్బర్​కు ఆ ప్రేమ వ్యవహారం జోలికి పోవద్దని మహ్మద్​ ఆలీ ఈసా చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రెండు నెలల నుంచి ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. మరో సారి వివాహిత భర్త మంగళవారం సాయంత్రం మహ్మద్​ ఆలీ ఈసాకు ఫోన్​ చేశాడు.

నీకు.. నీ స్నేహితుడుకి ఇంకా ఎన్ని సార్లు చెప్పాలే? ఇంకోసారి రియాసత్ ​నగర్​లోకి వస్తే నీది.. నీదోస్త్​ అంతు చూస్తానని హెచ్చరించాడు. దీంతో నువ్వు అక్బర్​ ఏమన్నా చేసుకోరి .. నా దగ్గరికి వస్తే బాగుండదని ఆలీ ఈసా కూడా వివాహిత భర్తను హెచ్చరించాడు. వెంటనే మహ్మద్​ ఆలీ ఈసా అక్బర్​కు ఫోన్ ​చేశాడు. నీ వ్యవహారం కారణంగా నన్ను తిడుతున్నారని.. ఇద్దరి మధ్య ఫోన్​లో మరోసారి వాగ్వివాదం తలెత్తింది. నేను రియాసత్ ​నగర్​ డికాషన్​ హోటల్​కు వస్తున్నానంటూ అక్కడికి రమ్మని మహ్మద్​ ఆలీ ఈసాకు చెప్పాడు అక్బర్. దీంతో చెప్పిన దాని ప్రకారం అక్బర్ ​తన ప్రియురాలితో కలిసి బైక్​పై ఈసా దగ్గరికి వచ్చాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది.

దీంతో అక్బర్​ పైప్​తో ఈసా తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అతని దగ్గర నుంచి ఈసా పైప్​ను గుంజుకున్నాడు. వెంటనే అక్బర్​ తన వెనుక జేబులో ఉన్న కత్తితో ఈసాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఈసాకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా అక్బర్​పై మాదన్నపేట్​లో అత్యాచార కేసు, మరో చోరీ కేసులు ఉన్నాయని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్​ నగర్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed