ఏపీలో దారుణం.. కన్న కూతురుని గర్భవతిని చేసిన తండ్రి..

124
rape

దిశ, ఏపీ బ్యూరో: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కాలనాగులా కాటేశాడు . కుమార్తెపై కొన్ని నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె ఆరా తీశారు. అనంతపురం జిల్లా పోలీసు అధికారులతో వాసిరెడ్డి పద్మ ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ స్ర్తీ హింస వ్యతిరేక దినోత్సవం రోజే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం విచారకరమన్నారు.

ఆడవాళ్లకు ఇంట్లోనే రక్షణలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిచయస్తులే లైంగికదాడికి పాల్పడటాన్ని సమాజం ఈసడించుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా భద్రతకు సంబంధించి అత్యున్నత స్థాయి నిర్ణయాలు అమలు చేస్తున్నారు. మహిళా భద్రత కోసం రూపొందించిన ‘దిశ యాప్‘ వినియోగంపై అందరూ ప్రధానంగా దృష్టి సారించాలి. ఇళ్లల్లో చెప్పుకోలేని వేధింపుల నుంచి కూడా ‘దిశ యాప్‘ వినియోగంతో రక్షణ పొందవచ్చు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..