నాగర్‌ కర్నూలులో దారుణం.. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం!

429
gang rape in Gandhi Hospital

దిశ, నాగర్‌కర్నూల్: కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ కసాయి తండ్రి కన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఈ అమానుష ఘటన నాగర్‌ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుజూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తరచూ తాగి గొడవ పడటంతో భార్య దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఒంటరిగా ఉన్న తన కూతురిపై ఆ కసాయి తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటికి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అనుమానంగా కనిపించిన మనుమరాళిని నానమ్మ గట్టిగా మందలించడంతో విషయం చెప్పింది. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ గాంధీ నాయక్ గ్రామానికి వెళ్లి విచారిస్తున్నామని తెలిపారు.