- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిడ్డలను ఒడ్డుకు చేర్చాడు.. కానీ తాను మాత్రం
<p>దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బిడ్డలను కాపాడేందుకు ప్రయత్నించి ఒక తండ్రి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే మేడేపల్లి గ్రామానికి చెందిన కొల్లు సురేష్ కుమార్(45) తన పిల్లలతో కలిసి వాకింగ్ కి వెళ్ళాడు. సాగర్ ఎడమ కాలువలో ఈత కొడుతుండగా వారి పిల్లలు ఒడ్డున కూర్చున్నారు. ఇంతలో సురేష్ కుమార్ కొడుకు భవిత్(7) ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు. అది గమనించిన సురేష్ అన్న కొడుకు భవిత్ ని […]</p>

దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బిడ్డలను కాపాడేందుకు ప్రయత్నించి ఒక తండ్రి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే మేడేపల్లి గ్రామానికి చెందిన కొల్లు సురేష్ కుమార్(45) తన పిల్లలతో కలిసి వాకింగ్ కి వెళ్ళాడు. సాగర్ ఎడమ కాలువలో ఈత కొడుతుండగా వారి పిల్లలు ఒడ్డున కూర్చున్నారు. ఇంతలో సురేష్ కుమార్ కొడుకు భవిత్(7) ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు. అది గమనించిన సురేష్ అన్న కొడుకు భవిత్ ని పట్టుకునే ప్రయత్నం చేయబోయి అతను కూడా కాలవలో పడిపోయాడు.
ఇద్దరు కొడుకులు కాలువలో పడిపోవడం చూసిన సురేష్ హుటాహుటిన కాలువలోకి దిగి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఈ క్రమంలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువ కావడంతో సురేష్ నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కాలువలో మునిగిపోయిన సురేష్ ని వెలికి తీశారు. అప్పటికే అతను మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.






