- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాయంపేటలో దారుణం..తండ్రి చేతిలో కొడుకు హత్య
<p>దిశ, పరకాల: తండ్రి చేతిలో కొడుకు హత్యకు గురైన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రేగూరి పాపిరెడ్డి(55) తన కొడుకు రవీందర్ రెడ్డి(34)ని శుక్రవారం సాయంత్రం గొడ్డలితో నరికి చంపాడు. వీరిరువురు మూలంగా గతంలోనే తల్లి ఆత్మహత్యకు పాల్పడగా రవీందర్ రెడ్డి భార్య కాపురానికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో పాపి రెడ్డి, రవీందర్ రెడ్డి ఇరువురు తండ్రి కొడుకులు ఉండేవారు. వీళ్లు తరచూ మద్యం […]</p>

X
దిశ, పరకాల: తండ్రి చేతిలో కొడుకు హత్యకు గురైన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రేగూరి పాపిరెడ్డి(55) తన కొడుకు రవీందర్ రెడ్డి(34)ని శుక్రవారం సాయంత్రం గొడ్డలితో నరికి చంపాడు. వీరిరువురు మూలంగా గతంలోనే తల్లి ఆత్మహత్యకు పాల్పడగా రవీందర్ రెడ్డి భార్య కాపురానికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో పాపి రెడ్డి, రవీందర్ రెడ్డి ఇరువురు తండ్రి కొడుకులు ఉండేవారు.
వీళ్లు తరచూ మద్యం తాగుతూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య గొడవ జరిగి మాటా మాటా పెరగడంతో తండ్రి కొడుకును గొడ్డలితో నరికి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. మృతుడి భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Next Story






