మైక్ లాక్కున్న కుక్క… లైవ్ ఆపేసిన యాంకర్

by  |
మైక్ లాక్కున్న కుక్క… లైవ్ ఆపేసిన యాంకర్
X

దిశ, వెబ్ డెస్క్: ఒక పెద్ద టీవీ ఛానెల్.. వాతావరణ సూచన టాపిక్ పై లైవ్ నడుస్తుంది… యాంకరమ్మ గల గల మాట్లాడుతూ విషయాలను స్టూడియో లో ఉన్న మరో యాంకరమ్మ కు వివరిస్తుంది. అంతలోనే అనుకోకుండా ఒక అనుకోని అతిధి కెమెరా ముందుకు వచ్చింది.. దీంతో ఆ లైవ్ టెలికాస్ట్ కాస్తా వైరల్ అయ్యి కూర్చుంది. ఇంతకీ ఆ అనుకోని అతిధి ఎవరో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. సాధారణంగా పెంపుడు జంతువులు చేసే అల్లరి మాములుగా ఉండదు. అందులోను విశ్వాసంగా ఉండే శునకాల అల్లరి భరించడం చాలా కష్టమే సుమా! తాజాగా ఒక కుక్క చేసిన అల్లరి పనికి ఒక పాపులర్ టీవీ ఛానెల్ పరువు పోగొట్టుకుంది.

రష్యా లోని ఒక పాపులర్ టీవీ ఛానెల్ యాంకర్ నడెజా… ఎప్పటిలాగానే ఆ రోజు కూడా లైవ్ వాతావరణ వార్తల కోసం రోడ్డు మీద నిలబడి మైక్ పట్టుకొని వార్తలను రిపోర్టింగ్ చేస్తుంది. ఇంతలో సడెన్ గా ఎక్కడినుండి వచ్చిందో ఒక కుక్క వచ్చి ఆ మైక్ ని లాగేసుకొని పరిగెత్తింది. వెంటనే ఆ మైక్ కోసం నడెజా కూడా కుక్క వెనకాల పరిగెత్తింది. ఇక ఇదంతా లైవ్ లో చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యి.. ఆ తర్వాత నవ్వుకోవడం మొదలు పెట్టారు. ఇక ఇందంతా స్టూడియోలో చూస్తున్న మరో యాంకర్ అక్కడితో ప్రోగ్రాం కి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రష్యాలో కుక్కలు సైతం రిపోర్టింగ్ చేస్తాయి…. ఏ రిపోర్టింగ్ చేయడానికి కుక్క మైక్ పట్టుకొని పోతుందో? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed