- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండె తరుక్కుపోయే ఘటన.. ఏడుస్తూ తల్లిని లేపుతోన్న చిన్నారి
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం రాత్రి గుండె తరుక్కుపోయే ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ కళాశాల వెళ్లే దారిలో ఓ మహిళ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏమైందో తెలియక అప్పటివరకు తల్లి చేయిపట్టుకుని నడిచిన చిన్నారి ‘‘అమ్మా.. లే అమ్మా’’ అంటూ ఏడుస్తూ లేపుతోంది. ప్రత్యక్ష్యంగా చూసిన పలువురిని చిన్నారి రోదన కంటతడి పెట్టించింది. రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించక పోవడంతో సుమారు గంట వరకు ఆ […]</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం రాత్రి గుండె తరుక్కుపోయే ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ కళాశాల వెళ్లే దారిలో ఓ మహిళ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏమైందో తెలియక అప్పటివరకు తల్లి చేయిపట్టుకుని నడిచిన చిన్నారి ‘‘అమ్మా.. లే అమ్మా’’ అంటూ ఏడుస్తూ లేపుతోంది. ప్రత్యక్ష్యంగా చూసిన పలువురిని చిన్నారి రోదన కంటతడి పెట్టించింది. రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించక పోవడంతో సుమారు గంట వరకు ఆ విధంగానే పడివుంది. చివరకు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిని బాధ చూసి చలించిన స్థానికులు ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు కందపడిపోయిన మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story






