- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలరించిన విద్యార్థుల మానవహారం.. 2026కి ఘన స్వాగతం!
దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సరం 2026ని ఉత్సాహంగా స్వాగతిస్తూ విద్యార్థులు అద్భుతమైన మానవహారం (హ్యూమన్ చైన్) నిర్వహించారు.

X
దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సరం 2026ని ఉత్సాహంగా స్వాగతిస్తూ విద్యార్థులు అద్భుతమైన మానవహారం (హ్యూమన్ చైన్) నిర్వహించారు. "2025 బాయ్ బాయ్... 2026 వెల్‌కమ్" అంటూ చేతులు కలిపి నిలబడిన విద్యార్థుల కార్యక్రమం ఆకట్టుకుంది. ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్ మద్దిలేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పూర్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. రాబోయే ఏడాది మంచి మార్కులు సాధించి, పాఠశాల పేరును జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో రికార్డులు సృష్టించేలా చదువుకోవాలని గురువులు విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. ఇలాంటి మానవహారాలు విద్యార్థుల్లో ఐక్యత, క్రమశిక్షణ, ఉత్సాహాన్ని పెంచుతాయని ఉపాధ్యాయులు అన్నారు. విద్యార్థులు కూడా నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికారు.
Next Story






