చిట్టి చేతులు.. వెట్టి చాకిరి

by Bhanu |   (  Updated:2025-12-06 10:38:55  IST  )

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ పాఠశాలలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులతో వెట్టి చాకిరి చేపిస్తున్నారు.

చిట్టి చేతులు.. వెట్టి చాకిరి
X

దిశ,దుబ్బాక: తరగతి గదుల్లో పెన్ను పుస్తకం పట్టుకొని చదువుకోవల్సిన సమయంలో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ పాఠశాల చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో లచ్చపేట మోడల్ పాఠశాలలో పుడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులతో వెట్టి చాకిరి చేపిస్తున్నారు. ప్రభుత్వం ఓ పక్క మోడల్ పాఠశాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెబుతున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తమ పిల్లలను చదువు కోసం పాఠశాలకు పంపిస్తే విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తూ విద్యార్థుల్ని పని వాళ్లగా మారుస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో ప్రభుత్వంపై నమ్మకంతో మోడల్ పాఠశాలకు బంగారు భవిష్యత్తుకు బాటల వేసుకుంటారని పాఠశాలకు పంపిస్తే.. పాఠశాలలో మాత్రం విద్యార్థులతో వంట పనులు చేపిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఉన్న గురుకుల పాఠశాలలు, మోడల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ కే.హైమవతి ప్రతి రోజు పాఠశాలలను సందర్శించి సూచనలు చేస్తున్నప్పటికీ లచ్చపేట మోడల్ పాఠశాలలో మాత్రం కలెక్టర్ ఆదేశాలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం సిద్దిపేట కలెక్టర్‌ హైమావతి ఏదో ఒక పాఠశాలను, గురుకులాన్ని సందర్శించి ఉపాధ్యాయులకు, హాస్టల్‌ నిర్వాహకులకు సూచనలు చేస్తున్నా, వారు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ విద్యార్థినులను హీనంగా చూడడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలో మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో వెట్టిచాకిరి చేపిస్తున్నారని పాఠశాల ప్రిన్సిపాల్‌ బుచ్చిబాబును వివరణ కోరగా తను స్థానిక ఎన్నికల్లో భాగంగా తమకు ఎలక్షన్ డ్యూటీ పడిందని పాఠశాలలోని విద్యార్థులతో వెట్టి చాకిరి చేపిస్తున్న విషయం తెలియదని తెలిపారు.

Next Story