కరోనా మొదటగా ఎవరికి సోకిందో తెలుసా..?

by  |
కరోనా మొదటగా ఎవరికి సోకిందో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతుంది. దాదాపుగా అది సుమారు 200 దేశాలను చుట్టేసింది. దీంతో ఆ జనాభా అంతా కూడా భయాందోళన వాతావరణం నెలకొన్నది. అది ఏ రూపంలో తమను చేరి మృత్యు ఒడిలోకి చేర్చుతుందోనని అందరూ ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా .. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే దాని కోరల్లో చిక్కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చనిపోయిన విషయం కూడా తెలిసిందే.

అయితే.. చాలామందికి కరోనా వైరస్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందిందని తెలుసు కానీ, అది మొదటగా ఎవరికి సోకిందనే విషయం చాలామందికి తెలియదు. అయితే చైనాకు చెందిన ఓ వార్తా పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. అదేమిటంటే.. చైనాలోని ది వాల్ స్ట్రీట్ జర్నల్ అనే ఓ పత్రిక ఈ అంశంపై ఓ కథనాన్ని ప్రచురించింది. వెయ్ గుషియన్ (57) అనే మహిళకు మొదటగా సోకిందని, ఈ మహిళ చైనాలోని వూహాన్ లో ఉన్న హువాన్ మార్కెట్ లో రొయ్యలు అమ్ముకుంటూ జీవనం గడుపుతుందని, ఈ సమయంలో ఆమెకు కరోనా వైరస్ సోకిందని ఆ కథనంలో పేర్కొన్నది.

Tags: Corona is the first victim, China, Wuhan, Wei Gushian, Huan Market


Next Story

Most Viewed