ఘోర ప్రమాదం.. రెండు బైకులను ఢీకొట్టిన కారు

133

దిశ, పాలేరు : తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని కొక్కిరేణి స్టేజి వద్ద గురువారం ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రెడ్డిబోయిన గంగాధర్ (27)అనే వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మర్రిపెడబంగ్లా వైపు నుంచి ఖమ్మం వస్తున్న కారు కొక్కెరేణి స్టేజి వద్ద హైవే ఎక్కుతున్న ఓ బైక్ ని తప్పియబోయి మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని 108 సహాయం ద్వారా గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమలాయపాలెం ఎస్సై రఘు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..