హృదయాన్ని ‘హత్తు’కునే పదేళ్ల బాలిక ఆవిష్కరణ

by  |
హృదయాన్ని ‘హత్తు’కునే పదేళ్ల బాలిక ఆవిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ప్రజలందరినీ గడప దాటి రాకుండా చేస్తోంది. మనిషికి, మనిషికి మధ్య మూడు అడుగుల దూరం ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. తమ సొంత వారిని కూడా దగ్గరికీ తీసుకోవడానికి కూడా సంకోచించేలా చేస్తోంది. కొన్ని దేశాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నా.. అమెరికాలో మాత్రం కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. దీంతో ప్రజలంతా చాలా భయం భయంగా బతుకుతున్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో చిన్నారులు తమకు ఇష్టమైన వారి తోడు కోరుకుంటారు. వారి ఒడిలో సేద తీరాలని ఆశపడతారు. కౌగిలించుకుని పడుకోవాలని అనుకుంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పదేళ్ల బాలిక పెయిజ్ కూడా అలానే కోరుకుంది. ఆ చిన్నారి తన పేరేంట్స్, గ్రాండ్ పేరేంట్స్ ను హత్తుకోవాలని అనుకుంది. కానీ కరోనా భయం.. వాళ్ల మధ్య అడ్డుగా నిలిచింది. దాంతో ఆ చిన్నారి వినూత్నంగా ఆలోచించి.. తన సమస్యకు పరిష్కారంగా ‘హగ్ కర్టెన్స్’ రూపొందించింది.

కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ ప్రాంతంలో నివసించే పెయిజ్ కు .. గ్రాండ్ పేరేంట్స్ అంటే చాలా ఇష్టం. ఆ పాప తన గ్రాండ్ పేరెంట్స్ ను హగ్ చేసుకోవడానికి ‘హగ్ కర్టెన్స్’ ను రూపొందించింది. యూ ట్యూబ్ లో రకరకాల వీడియోలు చూసి వీటికి రూపునిచ్చింది. పెయిజ్ వాళ్ల అమ్మ ఓక్రే .. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. ‘పెయిజ్ గంటల తరబడి ఫ్యామిలీ రూములో కూర్చుని ఏదో చేస్తోంది. కవర్లను కట్ చేస్తోంది. డిస్పోజల్ ప్లేట్స్ వాటికి స్టిక్ చేస్తోంది. మొత్తానికి ఏదో ట్రై చేస్తోంది. కాసేపటికి హగ్ కర్టెన్స్ తో నా ముందుకు వచ్చింది. వీటి సాయంతో గ్రాండ్ పేరెంట్స్ ను నేను హగ్ చేసుకుంటాను అని చెప్పింది. ఆ కర్టెన్ ను తీసుకెళ్లి.. మా అమ్మ ఇంటి డోర్ కు కట్టాను. పెయిజ్.. అమ్మమ్మ, తాతయ్య కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. వాళ్ల అమ్మమ్మ బయటకు రాగానే పెయిజ్ వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది. దాంతో మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. రెండు నెలల తర్వాత వాళ్లిద్దరూ అలా హగ్ చేసుకోవడం చూడటంతో నేను కూడా ఎమోషనల్ అయ్యాను. ఆమేజింగ్ లవ్. ఇది ఎంతో సంతోషకరమైన విషయం’ అని ఓక్రే తెలిపారు.


Next Story

Most Viewed