- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రానున్న నాలుగు రోజులు భానుడి ప్రతాపం.. మరో 5 రోజుల్లో భారీ వర్షాలు
ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం ముగిసినట్లే. ప్రస్తుతం భిన్న వాతావరణం కనిపిస్తుంది.

దిశ, వెబ్డెస్క్: ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం ముగిసినట్లే. ప్రస్తుతం భిన్న వాతావరణం కనిపిస్తుంది. పోయిన నెల చివరి పది రోజులు మొత్తం వానలు దంచికొట్టాయి. ఇక ఎండాకాలం అయిపోయినట్లేనని ప్రజలు భావించారు. ఇక జూన్ నెల ప్రారంభమవ్వగానే సూర్యుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. రెండు రోజులుగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే తెలంగాణలో ఇలాగే ఎండలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాదు వాతావరణ శాఖ తెలిపింది.
తర్వాత వచ్చే 5 రోజులు.. తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరీ నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చూసినట్లైతే..
హైద్రాబాద్లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






