Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణం అప్డేట్..

by Kodari Anjali |

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎండల నుంచి విముక్తి చెందాయి.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణం అప్డేట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎండల నుంచి విముక్తి చెందాయి. గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. సూర్య కిరణాలు డైరెక్టుగా భూమిపై పడుతున్నాయి. నేల వేడెక్కి.. రాత్రిళ్లు కూడా వేడిగానే ఉంటోంది. దీనికి తోడుగా వడగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని.. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలోనే నిన్న తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచికొట్టింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న జనాలకు తీపి కబురు అందడంలో జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. తెలంగాణలో రాగల మూడు రోజులల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే .. గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం.. 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story