- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
వరుస వర్షాలతో రాష్ట్రంలోని జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.

దిశ, వెబ్డెస్క్: వరుస వర్షాలతో రాష్ట్రంలోని జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్నాటక (North Karnataka) పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 14 నుంచి 17 వరకు అన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఏండీ (IMD) అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ముఖ్యంగా ఆగస్టు 15న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించారు.
అదేవిధంగా తెలంగాణలోని 11 జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక దక్షిణ కోస్తాంధ్ర (South Coastal Andhra) మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన ఉంది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.






