- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకాశంలో అద్భుతం.. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ప్రారంభం
ప్రపంచ వ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం(Lunar Eclipse) ప్రారంభం అయింది.

దిశ, వెబ్డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం(Lunar Eclipse) ప్రారంభం అయింది. గ్రహణ సమయంలో చంద్రుడు అత్యంత ఎర్రగా(Blood Moon) మారిపోతాడు. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువ సేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే 2018 జూలై 27 తర్వాత భారత్లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్లో అసోసియేట్ ప్రొఫెసర్స్ చెప్పుకొచ్చారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం చూడాలంటే 2028 డిసెంబరు 31 వరకూ వేచి చూడాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 7న రాత్రి 8:58 ప్రారంభం కాగా, రాత్రి 11:41 లకు గరిష్ట సంపూర్ణతను చేరుకుంటుందని.. రాత్రి 12:22 గంటల వరకు అంటే 82 నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతుంది. తర్వాత గ్రహణం క్రమంగా వీడి.. తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలను మూసివేశారు. తిరుమలలో శ్రీవారి ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం, జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి, ఛార్ధామ్ సహా అన్ని ఆలయాలను మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయాలు తెరుచుకోనున్నాయి. శుద్ధి చేశాక భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.






