- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలపడనున్న అల్పపీడనం.. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంతో పాటు మయన్మార్ తీరానికి ఆనుకుని కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుకుగా మారాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
మూడు రోజులు భారీ వర్షాలు..
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కుమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృత్తిరీత్యా బయట తిరిగే వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ఉట్నూరులో 10 సెంమీ. వర్షం
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. కుమరం భీం జిల్లా కెరమెరిలో 9 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు లో 9 సెం.మీ, బోధ్ లో 8 సెం.మీ, బజార్ హథ్నూర్ లో 8సెం.మీ, ఆదిలాబాద్ లో 8 సెం.మీ, కుమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ లో 7 సెం.మీ, దహేగావ్ లో 7 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా తమ్సీలో 7 సెం.మీ, మంచిర్యాల జిల్లా భీమినిలో 6 సెం.మీ, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ లో 6 సెం.మీ, కుమరం భీం అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, వాంకిడి, సిర్పూరులో 6 సెం.మీ ల చొప్పున వర్షాపాతం నమోదైంది.






