రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

by Yella Dhawani Reddy |

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.

రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో, పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీచేశారు.

ఇక ఏపీలో కూడా రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story