- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather Alert : రానున్న 24 గంటల్లో ఏపీకి భారీ వర్షాలు
ఏపీకి వాయుగుండం ముంపు కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి వాయుగుండం ముంపు కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కి.మీ. దూరంలోనూ, చెన్నైకి ఈశాన్యంగా 480 కి.మీ., గోపాల్‌పూర్‌కు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తూర్పు, ఈశాన్యం దిశగా రాగల 12 గంటలపాటు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల దృష్ట్యా విశాఖపట్టణంలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులతో సమీక్షించి పరిశీలిస్తున్నారు. వారికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు.






