- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain Alert : మరో 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
by Muthe.Rajitha |
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురవనుందని వాతావరణశాఖ హెచ్చరించింది(Rain Alert).

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురవనుందని వాతావరణశాఖ హెచ్చరించింది(Rain Alert). శుక్రవారం సాయంత్రం 5:50 నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగుల(Hailstroms)తో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు(Gusty Winds) వీచే అవకాశం ఉంది. హైదరాబాద్(Hyderabad)లో కూడా మోస్తరు వర్షం, గాలులతో కూడిన వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది.
Next Story






