Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) నగరంలో కుండపోత వాన(MASSIVE DOWNPOUR) కురుస్తోంది.

Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో కుండపోత వాన(MASSIVE DOWNPOUR) కురుస్తోంది. నగరంలోని నార్త్, సౌత్ ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం(Heavy Rain) కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. నల్లగండ్ల, కూకట్పల్లి, అమీర్ పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, ఉప్పల్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, ECIL, కాప్రా, నాచారం, విద్యానగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపుల(THUNDER STRIKE)తో కూడిన వర్షం పడుతోంది.

అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని GHMC, HYDRAA అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో కూడా అత్యధిక వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.

Next Story