- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్(Hyderabad Rains)లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad Rains)లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు ఈదురు గాలుల(Gusty Winds)తో కూడిన ఉరుములు(Thunders), మెరుపులు నగరవ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, మలక్‌పేట, మారేడుపల్లి, అల్వాల్, తార్నాక, హబ్సిగూడ, కూకట్పల్లి, నాంపల్లి, కోఠి, లక్డీకాపూల్, రాజేంద్రనగర్, చార్మినార్, మెహెదీపట్నం, టోలిచౌకి, నార్సింగి వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(LPA)తోపాటు క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది. గంటకు 30-50 కి.మీ వేగంతో గాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి, రోడ్లు జలమయమయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరా ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో 35.4 మి.మీ వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(TSDPS) తెలిపింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని తొలగించడానికి GHMC, మున్సిపల్ అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు.
ప్రజలు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, రహదారులపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి వంటి 11 జిల్లాలకు యెల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసిన IMD.. మే ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.






