- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఏ తేదీ వరకు వానలు రానున్నాయంటే..?
ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం ముగిసినట్లే. ఈ నెల మొత్తం వానలు దంచికొట్టనున్నాయని వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం ముగిసినట్లే. ఈ నెల మొత్తం వానలు దంచికొట్టనున్నాయని వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు. రోహిణి కార్తె వేళ భనుడు భగభగలాడుతాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇక వానలు ఆగేలా కనిపించడం లేదు. నైరుతి బుురు పవనాలు ముందుగానే ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాయి. కాగా జూన్ మొదటి వీక్‌లోనే బుుతుపవనాలు తెలుగు రాష్రాల్లోకి ప్రవేశించనున్నాయి. అయితే అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కాగా నాలుగైదు రోజులు కుండపోత వర్షాలు రానున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాదు నగరంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడే చాన్స్ ఉందని.. ఏపీలో తూర్పు గోదావరి, అల్లూరి, మన్యం కాకినాడ, కోనసీమ, ఏలూరు వంటి జిల్లాల్లో వానలు పడనున్నాయని పేర్కొంది. ఇక జూన్ రెండో వారంలో ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






