రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త

by Gantepaka Srikanth |
రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు భారత వాతావరణ కేంద్రం(India Meteorological Department) భారీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతాయని చెప్పింది. సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది 105 శాతం వర్షాపాతానికి అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. రైతులు వర్షాదారిత పంటలు వేసుకొచ్చని సూచన చేసింది.

మరోవైపు ఇప్పటికే తెలంగాణలో రానున్న వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో వడదెబ్బల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని ఐఎండీ సూచించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. హీట్‌వేవ్ (వడగాలులు), సన్ స్ట్రోక్‌ (వడదెబ్బ)లను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా (స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్) ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed