Cyclone : బంగ్లాదేశ్ వద్ద తీరం దాటిన వాయుగుండం

by Muthe.Rajitha |

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్(Bangladesh) ఖేపుపర(Khepapura) సమీపంలో తీరం దాటింది.

Cyclone : బంగ్లాదేశ్ వద్ద తీరం దాటిన వాయుగుండం
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్(Bangladesh)లోని ఖేపుపర(Khepapura) సమీపంలో తీరం దాటింది. ఈ వాయుగుండం వల్ల ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కత్తా, హౌరా, మేదినీపూర్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు(DownPours) కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కొన్ని చోట్ల భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ఏపీ(AP)లోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలుకురిసే అవకాశం ఉండగా.. తీరం వెంబడి 60-80 కి.మీ./గం. వేగంతో బలమైన ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ వాయుగుండం వల్ల గంటకు 140 కి.మీ వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని తెలిపారు. మే 31 వరకు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే ఉన్నవారు తక్షణం తీరానికి తిరిగి రావాలని IMD సూచించింది. ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ శాఖలు వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి.. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

Next Story