- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Rain Alert : హైదరాబాద్ కు బిగ్ రెయిన్ అలర్ట్
హైదరాబాద్(Hyderabad) కు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) జారీ చేసింది వాతావరణశాఖ.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) కు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) జారీ చేసింది వాతావరణశాఖ. బుధవారం సాయంత్రం 6:30 నుంచి 9:00 గంటల మధ్య భారీ వర్షం(Heavy Rain) కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. నార్త్ హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయని.. క్రమంగా అవి నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది ఇండియా మెటియరాలజికల్ డిపార్ట్‌మెంట్(IMD). ఉరుములు(Thunders), ఈదురుగాలుల(Gusty Winds)తో కూడిన మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉండగా.. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో.. ట్రాఫిక్ జామ్‌లు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తవచ్చని అధికారులు తెలిపారు. రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉరుములు, మెరుపుల నుంచి సురక్షితంగా ఉండమని సూచించారు.






