బీర్ బాటిల్ మూత వెన‌క ఇంత సైన్స్ ఉందా? తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

by Ajay Maddhiboyina |

మ‌నం చాలా వ‌స్తువుల‌ను వాడ‌తాం కానీ అలి ఎలా ఉన్నాయి. ఎందుకు అలాగే ఉన్నాయి అనే విష‌యాల‌ను ప‌ట్టించుకోము. కానీ చాలా వ‌స్తువుల నిర్మాణం వెన‌క సైన్స్ ఉంటుంది. బీర్ బాటిల్స్, గాజు కూల్ డ్రింక్ సీసాల మూత‌ల వెనుక కూడా అలాంటి సైన్స్ దాగుంది.

బీర్ బాటిల్ మూత వెన‌క ఇంత సైన్స్ ఉందా? తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!
X

దిశ, వెబ్ డెస్క్: మ‌నం చాలా వ‌స్తువుల‌ను వాడ‌తాం కానీ అలి ఎలా ఉన్నాయి. ఎందుకు అలాగే ఉన్నాయి అనే విష‌యాల‌ను ప‌ట్టించుకోము. కానీ చాలా వ‌స్తువుల నిర్మాణం వెన‌క సైన్స్ ఉంటుంది. బీర్ బాటిల్స్, గాజు కూల్ డ్రింక్ సీసాల మూత‌ల వెనుక కూడా అలాంటి సైన్స్ దాగుంది. ప్రస్తుతం బీర్ బాటిళ్లకు ఉన్న మూతలను క్రౌన్ క్యాప్స్ అంటారు. వీటి కంటే ముందు స్క్రూ క్యాప్స్ వాడారు. అయితే అవి వాడటం వల్ల గ్యాస్ పోవడం, బీరు రుచి తగ్గడం లాంటివి జిరిగిన తరవాత క్రౌన్ క్యాపులను వాడటం మొదలు పెట్టారు.

వీటిని 1892లో మెకానికల్ ఇంజనీర్ విలియం పెయింటర్ కనిపెట్టాడు. ఆయనకు ఉన్న ఓ బాటిల్ కంపెనీ కోసం క్రౌన్ క్యాపులను రూపొందించారు. అయితే మొదట వీటిని 24 అంచులతో తయారు చేయగా తెరవడం చాలా కష్టంగా ఉండేది. అంతే కాకుండా బాటిల్స్ కూడా పగిపోయేవట. 22, 22 అంచుల క్యాపులను తయారు చేసినా అవి కూడా సరైన ఫలితాలను ఇవ్వలేదు.

దీంతో అనేక ప‌రిశోధ‌న‌ల త‌ర‌వాత స‌రి సంఖ్య‌ల‌తో క్రౌన్ క్యాప్ త‌యారు చేయ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని గ‌మ‌నించారు. త‌ర‌వాత బేసి సంఖ్య 21 అంచుల‌తో క్యాప్ త‌యారు చేయ‌గా డ్రింక్ చాలా తాజాగా ఉండ‌టం, మూత కూడా సులువుగా రావ‌డం గ‌మ‌నించారు. అప్ప‌టి నుండి కేవ‌లం 21 అంచుల‌తోనే బీర్ బాటిల్స్, గాజు కూల్ డ్రింక్ బాటిల్స్ మూత‌ల‌ను త‌యారు చేస్తున్నారు. ఒక‌వేళ మీకు కూడా అనుమానం ఉంటే ఒక‌సారి మూత తీసుకుని లెక్కించండి. ప్ర‌పంచంలో ఎక్క‌డ వెతికినా 21 అంచుల మూత‌ల క్రౌన్ క్యాపులు మాత్ర‌మే ఉంటాయి.

Next Story