Sex & Science : నా ఫ్రెండ్‌పై ఇద్దరు అత్యాచారం చేశారు.. ఎయిడ్స్ వస్తుందా..?

by Bhoopathi Nagaiah |
Sex & Science : నా ఫ్రెండ్‌పై ఇద్దరు అత్యాచారం చేశారు.. ఎయిడ్స్ వస్తుందా..?
X

మేము ఇద్దరం ప్రాణస్నేహితులం. నా ఫ్రెండ్ చాలా మంచిది. తెలివైనది. అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం. అయితే ఈ మధ్య చాలా రోజులుగా డిప్రెషన్లో ఉంటోంది. ఏడుస్తుంది. నేను చాలాసార్లు అడగగా... తన సమస్యను చెప్పింది. తనపై చిన్నప్పుడు ఇద్దరు అత్యాచారం చేశారని చెప్పింది. అయితే తనకు మ్యారేజ్ సెటిల్ కాబోతోందని... ఒకవేళ తనకు ఎయిడ్స్(AIDS) వస్తే తన వల్ల ఇంకో వ్యక్తి జీవితం నాశనం అవుతుందని ఏడుస్తోంది. అలాగని రక్తపరీక్ష చేయించే పరిస్థితులు కూడా తనకు లేవు. చనిపోతానని బాధపడుతోంది. అయితే ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలు కావస్తోంది. మీరు ఇచ్చే సమాధానం ఒక అమ్మాయి జీవితం నిలబెడుతుంది. నా స్నేహితురాలి బాధను చూడలేక మీకు ఉత్తరం రాస్తున్నాను. ఆ అమ్మాయి జీవితం నిలబెట్టండి.

చిన్నపుడెప్పుడో నీ స్నేహితురాలిపై జరిగిన అత్యాచారం గురించి అనవసరంగా ఆలోచించి విపరీతమైన ఆందోళనకు గురై... మనశ్శాంతిని కోల్పోతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దని చెప్పండి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం లైంగిక అచ్యాచారానికి గురైతే... అత్యాచారం చేసిన వారికి ఎయిడ్స్ ఉంటే, అది జరిగిన 3 నెలల లోపే అది బయటపడుతుంది. 10 సంవత్సరాలు అయినా ఏమీ కాలేదు కాబట్టి ఎయిడ్స్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అనవసరంగా మీ స్నేహితురాలిని తను చేయని తప్పుకు బాధపడవలసిన అవసరం లేదని చెప్పండి. అసలు పశ్చాత్తాపం చెందవలసిన వారు అత్యాచారం చేసిన ఆ మానవ మృగాలు. ముందుగా మీ స్నేహితురాలిని డిప్రెషన్ నుండి బయటపడమని చెప్పండి. ఆమెను నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోమని చెప్పండి. కావలసి వస్తే ఆమెను ఒకసారి మారైటల్ కౌన్సిలర్ వద్దకు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story