58 ఏళ్ల మా ఆయన నన్ను శృంగారం కోసం బలవంతం చేస్తున్నాడు.. నేనేం చేయాలి

by Bhoopathi Nagaiah |

నాకు ఇప్పుడు శృంగారం పట్ల ఏ ఆసక్తీ లేదు. ఎందుకంటే, కలయికలో మంట, నొప్పి ఉంటున్నాయి. ఒక్కసారి కలిస్తే పదిహేను రోజులు మంటతో బాధ పడాలి,

58 ఏళ్ల మా ఆయన నన్ను శృంగారం కోసం బలవంతం చేస్తున్నాడు.. నేనేం చేయాలి
X

మేడమ్! నా వయస్సు 52 సంవత్సరాలు. మా వారికి 58 సంవత్సరాలు. నాకు ఐదేళ్ల కిందట గర్భసంచి తీసేశారు. అలాగే, ఒక అండాశయం ఇన్ఫెక్షన్ అయిందని తీసేశారు. నాకు షుగరు, బీపీ రెండూ ఉన్నాయి. నాకు ఇప్పుడు శృంగారం పట్ల ఏ ఆసక్తీ లేదు. ఎందుకంటే, కలయికలో మంట, నొప్పి ఉంటున్నాయి. ఒక్కసారి కలిస్తే పదిహేను రోజులు మంటతో బాధ పడాలి, నీళ్లు తగిలినా భగ్గుమని మండుతుంది. మా వారికి ఇది అర్థం కాదు. ఎప్పుడూ అనంతృప్తితో చిర్రుబుర్రు లాడుతుంటారు. ఇంటి నిండా మనవలు, మనవరాళ్లు ఉంటారు. నేనిప్పుడు ఆయనకు పనికి రాకుండా పోయానట. ‘ఇంట్లది పనికిరాదు.. బయటికి పోరాదు..’ అని ఈసడిస్తుంటారు. నా దాంపత్య జీవితంలో ఆపరేషన్ కంటే ముందు మా వారికి సెక్స్ సమస్యలున్నా నేనేనాడూ ఆయన్ను పల్లెత్తు మాటనలేదు. కానీ, నన్ను ఆయన ఇప్పుడొక పురుగులా చూస్తున్నారు. బయటకు వెళ్లాలని ఉన్నా ఆయనకు ఎయిడ్స్ భయమట. నా ముందు ఇలా వాపోతూ ఉంటారు. నేనేం చేయాలి?

పరేషన్ కంటే ముందే ఆయనకు సెక్స్‌లో సమస్యలు ఉన్నా మీరు పల్లెత్తు మాట ఆనకుండా ఆయన బాధపడతారని భరిస్తూ వచ్చారు. అందులోనే మీ సంస్కారం తెలుస్తుంది. కానీ, స్త్రీల ఆరోగ్య, శృంగారానికి పనికిరాని వస్తువుగా చూడటం చాలా అమాననీయం, అశాస్త్రీయం, అజ్ఞానం కూడా. గర్భాశయం పిండాన్ని మోసే ఒక సంచి మాత్రమే. శృంగారంలో దానికి ఏ పాత్ర ఉండదు. కోరిక, ఇష్టాలకు ఆధారం శృంగార హార్మోను ఈస్ట్రోజన్. ఒకే అండాశయం ఉన్నా ఈ సెక్స్ హార్మోన్ విడుదలవుతుంది. కాకపోతే, కొద్దిగా తక్కువ. అలాగే, బాహ్య సెక్సు అవయవాలైన యోని, యోని నాళం అత్యధిక సెక్సు నరాలుండే స్త్రీకి భావప్రాప్తిని, సెక్సులో ఆసక్తినీ కలిగించే క్లైటోరిస్ షాఫ్ట్ ఇవే సెక్సుకు పనికి వస్తాయి. కానీ గర్భాశయం కాదు. మీకు డయాబెటిస్, బీపీ ఉండటంతో పాటు వాటికి వాడే మందులు కూడా శృంగారంలో ఆసక్తిని తగ్గించేవే! అయినా గానీ, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శృంగారంలో ఆసక్తిని (మీకు ఇష్టం ఉంటేనే) పెంచుకోవచ్చు. ఈస్ట్రోజన్ మెండుగా ఉండే సోయాబీన్స్ ఉత్పత్తులు రోజూ తీస్కోవడం, ఈస్ట్రోజన్ జెల్ యోనిలో రోజూ వాడటం వల్ల అక్కడ తడిగా ఉండి కలయికలో మంట పుట్టదు.

ఇక, మీ భర్త విషయానికి వస్తే మీ ముందు మీ అస్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే చెత్తమాటలు మాట్లాడ వద్దని వార్నింగ్ ఇవ్వండి. మిమ్మల్ని కించ పరిచినప్పుడల్లా అతని లైంగిక లోపాలను గుర్తు చేయండి. గతంలో అతను మీ ముందు లైంగికంగా వైఫల్యం చెందినప్పుడు అతనిలా మీరు 'అతను సెక్సుకు పనికి రాని వాడు' అని కించపరచలేదని గుర్తు చేయండి. పరాయి స్త్రీల దగ్గరికి వెళితే భయంకరమైన సుఖరోగాలు, ఎయిడ్స్ వచ్చి చస్తాడు. సుఖవ్యాధులు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఒక్కసారి వచ్చి పోరు. మరణించే వరకూ చస్తూ బతుకుతారు. ఆ విషయం చెప్పండి ఆయనకు. మీకసలే డయాబెటిస్ ఉంది. నేను చెప్పిన ఈస్ట్రోజన్ క్రీము వాడచ్చు. మీ వారు నిరోధ్ వాడచ్చు. దానివల్ల మీకు రాపిడి తక్కువై నొప్పి, మంట తగ్గుతాయి. వారు నించలేనంత బాధ ఉంటే సెక్స్ అవాయిడ్ చేయండి. మీ వారికి ఇక 60 ఏళ్ళు వచ్చాయి, కాబట్టి జీవితంలో కావాల్సినంత దాంపత్యం అనుభవించారు. వీళ్ళు అనారోగ్యం ఉంది కాబట్టి, పదహారేళ్ళ పడుచు వాడిలా కోరికలతో సతమతమవ్వాల్సిన అవసరం లేదు. తన వృద్ధాప్య జీవితాన్ని సమాజ సేవకి కేటాయించమనండి. శృంగారమే జీవితం కాదు. ప్రేమ, బాధ్యత, నీతి - విలువలతో ఉండటం శృంగారాన్ని మించిన ఆనందాన్నిస్తుందని మీ వారికి చెప్పండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story