మా వారికి సెక్స్ కోరికలు ఎక్కువ.. ప్రసవం తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు..?

by Bhoopathi Nagaiah |
మా వారికి సెక్స్ కోరికలు ఎక్కువ.. ప్రసవం తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు..?
X

మీరు ఇచ్చే సూచనలు బాగుంటున్నాయి. నాకు పెళ్లయి ఒకటిన్నర సంవత్సరం అయింది. నాకిప్పుడు 4వ నెల నడుస్తోంది. కాన్పు అయిన ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు? మా వారికి కోరికలు ఎక్కువ. కానీ, నాకే గర్భంలోని పాపకి ఏమన్నా అవుతుందేమోనన్న భయం. కాన్పు అయ్యే దాకా... ఎన్ని రోజుల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. తగిన సూచన వెంటనే ఇవ్వగలరు.

కాన్పు సహజంగా అయితే 45 రోజుల తర్వాత కూడా, ఏ రకమైన దుర్వాసనతో కూడిన రక్తస్రావం కాకుండా గర్భసంచి మునపటి స్థానంలోకి వేడితె 45 రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. కుట్టుపడితే అది పూర్తిగా ఎండిపోయి... ఆమెకు ఎటువంటి నొప్పి లేకుండా ఉంటే నిరభ్యంతరంగా 45 రోజుల తర్వాత సెక్స్ చేయవచ్చు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు అయితే 16 వారాలు కచ్చితంగా దాంపత్య జీవితంలో పాల్గొనకూడదు. అయితే దంపతులు పైపై స్పర్శలు సుఖాలు పొంద వచ్చు. అలాగే కాన్పుకు ముందు సెర్విక్స్క కుట్లుపడడం... వెజైనల్ బ్లీడింగ్ అవడం... అంతకు ముందు అబార్షన్ (గర్భస్రావం) జరగడం లాంటివి ఉంటే... సెక్స్‌లో పాల్గొన కూడదు. అయితే ఎటువంటి అనారోగ్యం లేకుంటే తొమ్మిదవ నెల వరకు అనుకూలమైన భంగిమలో అంటే కడుపుపై భారం పడకుండా ఉన్న భంగిమలను దంపతులు ఎంచుకోవాలి. కాన్పుకు 10 రోజుల ముందు శృంగారం ఆపితే మంచిది. మీ వారికి ఎంత కోరికలు ఉన్నా మీ గురించి..., మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించడం మంచిది. ఒక వేళ బలవంతం చేస్తే, మీలో ఉన్న సందేహాలకు తోడుగా అనవసరమైన భయాందోళనలు తోడై కాన్పుకు ముందు స్ట్రెస్కు లోనవుతారు. అది మీకు... మీ కడుపులోని పాపాయికి కూడా అంత మంచిది కాదు. గర్భిణికి శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. మీ వారు ఈ సంగతి గ్రహిస్తే మంచింది.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed