జల్సాలు, బెట్టింగ్ల కోసం చైన్ స్నాచింగ్…యువకుల అరెస్ట్

by Chintha Aamani |

జల్సా లకు, బెట్టింగ్ లకు అలవాటు తో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న

జల్సాలు, బెట్టింగ్ల కోసం చైన్ స్నాచింగ్…యువకుల అరెస్ట్
X

దిశ, మెదక్ టౌన్ : జల్సా లకు, బెట్టింగ్ లకు అలవాటు తో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్సాలకు, బెట్టింగ్ లకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలు చిరునామా అడుగుతున్నట్లు నటిస్తూ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. మెదక్ పట్టణానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్, మహమ్మద్ అబ్దుల్ షఫీ ఇద్దరు వారి స్నేహితుడైన మహ్మద్ హఫీజ్ వద్ద నుండి బైక్ తీసుకుని, చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్నట్లు తెలిపారు.

సోమవారం సాయంత్రం ఔరంగాబాద్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా యునికార్న్ బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకొని పారిపోయారని అన్నారు. పోలీసులు వారిని వెంబడించి హవేలి ఘనపూర్ లో విచారణ చేయగా హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని ముత్తాయి కోట, జక్కన్నపేట, బూరుగుపల్లి శివారులో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ఆరు తులాల బంగారం, రెండు హెల్మెట్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపూర్, రాజంపేట, బిక్నూర్ మండలం జంగంపల్లి శివారులో ఆరు తులాల బంగారాన్ని చైన్ స్నాచింగ్ చేసినట్టు తెలిపారు. కామారెడ్డి లో చైన్ స్నాచింగ్ లో దోచుకున్న బంగారాన్ని హైదరాబాదులోని వాల్యూ గోల్డ్ లో అమ్మగా వచ్చిన 2, 08,293 నగదును చెరిసగం పంచుకున్నారని తెలిపారు. వాల్యూ గోల్డ్ వారికి కూడా నోటీసులు ఇచ్చామని దాన్ని కూడా రికవరీ చేస్తామని తెలిపారు. యువకుల మీద తల్లిదండ్రుల మీద నిఘా ఉంచాలని యువత మంచి మార్గంలో నడిచేటట్లు ఆదర్శంగా ఉండాలని కోరారు.

Next Story