వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే.. మగాళ్లలో కలిగే మార్పులివే...!

by Sujitha Rachapalli |

సెక్స్ అనేది ఒక వ్యాయామం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఈ విషయం మనకు తెలుసు కానీ నెలలో ఎన్ని సార్లు సాన్నిహిత్యంగా ఉండాలి? వారంలో ఎన్ని రోజులు శృంగారంలో పాల్గొనాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా మంది

వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే.. మగాళ్లలో కలిగే మార్పులివే...!
X

దిశ, వెబ్ డెస్క్ : సెక్స్ అనేది ఒక వ్యాయామం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఈ విషయం మనకు తెలుసు కానీ నెలలో ఎన్ని సార్లు సాన్నిహిత్యంగా ఉండాలి? వారంలో ఎన్ని రోజులు శృంగారంలో పాల్గొనాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా మంది బయటకు అడగరు. కారణం దీన్ని ఒక సీక్రెట్‌గానే పరిగణిస్తారు. ఓపెన్‌గా మాట్లాడేందుకు సాహసం చేయరు. అయితే ఓ అధ్యయనం ఇదే విషయంపై రీసెర్చ్ చేసింది. ముఖ్యంగా మగాళ్లు వారంలో రెండు సార్లు సెక్స్‌లో పాల్గొంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని గుర్తించింది. నెలకు ఒకసారి, అంతకంటే తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే వీరి గుండెపోటు, కార్డియో వాస్క్యులర్ సమస్యలు వచ్చే చాన్స్ 45శాతం తక్కువగా ఉందని స్పష్టం చేసింది.

* నిజానికి సెక్స్ అనేది ఎక్సర్‌సైజ్‌గా పని చేస్తుంది. హార్ట్‌కు బ్లడ్ ఫ్లోను పెంచుతుంది. రక్తపోటును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది.

* సెక్స్ చేసేటప్పుడు విడుదలయ్యే లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్.. ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపై ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటుంది.

* అలాగే టెస్టోస్టెరాన్ బ్యాలెన్స్ మెయింటెన్ కావడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

* అంతేకాదు భాగస్వాముల మధ్య స్ట్రాంగ్ బాండ్ డెవలప్ కావడం వల్ల మెంటల్ హెల్త్ బాగుంటుంది.

Next Story