- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శరీరం ఓ చోట.. పురుషాంగం మరో చోట... వింతైన శృంగార సామర్థ్యం

దిశ, ఫీచర్స్ : ఒక జీవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే పునరుత్పత్తి వ్యవస్థ కీలకం. ఈ ఫెర్టిలిటీ సిస్టమ్స్ ఒక్కో జీవిలో ఒక్కో విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటిమసీలో పాల్గొనే తీరు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ఆడ స్పైడర్ మేటింగ్ ముగిశాక మగ స్పైడర్‌ను బంధించి తినేస్తుంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు మగ స్పైడర్ స్ట్రాటజీలు అమలు చేయాల్సి ఉంటుంది. కాగా సైంటిస్టులు కొత్తగా ఫలోపాడ్ జాతికి చెందిన ఆర్గోనాటా యొక్క యూనిక్ సెక్స్ ప్యాటర్న్ గురించి గుర్తించారు. దీన్ని సెపేపర్ నాటిలస్ అని కూడా పిలుస్తుండగా... దీనికి సంబంధించిన వింత విషయాన్ని తెలుసుకుందాం.
సముద్రపు జీవి ఆర్గోనాటా ప్రత్యేక శృంగార సామర్థ్యం, పునరుత్పత్తి వ్యవస్థను కలిగి ఉంది. మగ జీవి శరీరంలోని పెనిస్.. బాడీ నుంచి విడిపోయి ఆడ జీవి దగ్గరకు చేరే సౌలభ్యాన్ని కలిగి ఉంది. ఈ సీక్రెట్ ఆయుధాన్ని హెక్టోకోటైలస్ అని పిలుస్తుంటారు. కాగా కెమికల్ సిగ్నల్స్‌తో ఆడ జీవి జాడను కనిపెట్టే ఆర్గోనాటా.. తన జన్యువులను మోసుకెళ్లే స్వతంత్ర జీవిగా పరిగణించబడే హెక్టోకోటైలస్‌ను సిద్ధం చేస్తుంది. శరీరం నుంచి విడిపోయి చిన్న రెక్కల లాంటి కదలికలతో నీటిలో ఈదుతూ తను కోరుకున్న భాగస్వామిని చేరుతుంది. స్పెర్మ్‌తో నిండిన ఈ పార్ట్ ఆడ జీవి షెల్స్‌కు చేరవేస్తుంది.