అంగన్ వాడీలను బలోపేతం చేయాలి

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అక్షరం, పౌష్టికాహారం అందించే వనరులకు నిలయా (మూలా)లు. వీటిని నిర్లక్ష్యం చేయరాదు.

అంగన్ వాడీలను బలోపేతం చేయాలి
X

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అక్షరం, పౌష్టికాహారం అందించే వనరులకు నిలయా (మూలా)లు. వీటిని నిర్లక్ష్యం చేయరాదు. గర్భిణులు, బాలింతలు, ఐదేళ్ల లోపు చిన్నారులకు ఉచితంగా అక్షరాలు, పోషకాలతో ఆరోగ్య మహాభాగ్యాన్ని పొందవచ్చు. ఈ కేంద్రాల్లోని లోటు పాట్లను సవరించి మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని భావిస్తోంది. దాదాపు 20 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో టీచర్లు, హెల్పర్లు లేకపోవడంతో కొన్నిచోట్ల రోజువారి నిర్వహణ, పూర్వ ప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం కష్టంగా మారుతుంది.

వేలాది ఖాళీల భర్తీ

65ఏళ్లు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం నియామకాలు జరగకపోవడంతో ఖాళీలు పెరిగిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించినా.. నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆ సమస్యలను అధిగమించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు గుర్తించిన ఖాళీలల్లో 6,399 టీచర్ పోస్టులు, 7,834 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. మన రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో టీచర్‌తో పాటు హెల్పర్ తప్పనిసరిగా ఉండాలి.

ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు పిల్లల సంరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో లబ్ధిదారులకు పోషకాహారం అందివ్వడంతో పాటు ఐదేళ్లలోపు చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నారు. వీటిపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ లబ్ధిదారుల చేరికలు తక్కవ ఉండటంతో పాట వారి హాజరులో వ్యత్యాసాలు ఉన్నాయి.ఈ కేంద్రాలకు ట్యాబులు అందిస్తూ ఆన్ లైన్ అనుసంధానం చేయడం, నియామకాలు, మౌలిక వసతులు ఏర్పరిచి అందరికీ అంగన్వాడీ సేవలతో లబ్ధిదారుల హాజరు పెంచాలని ప్రభుత్వం బాస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలు

ఆవాసాలకు అంగన్వాడీల దూరంగా ఉండటం. చేరికలు తక్కువగా ఉన్న కేంద్రాలు. గ్రామాల్లో, నగరాల వేరువేరు సమస్యలను పరిశీలించి వసతులకు నిధులు పెంచుతూ భవన నిర్మాణాలు, నియమకాలు, నీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్లుతోంది. పట్టణాల్లో, గ్రామాల్లో పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగా ఈ పంద్రాగస్టు నాటికి మరో కొత్త పథకం రాబోతోంది..

ఉదయం టిఫిన్, గుడ్లు, టిక్కీలు

ఇప్పటిదాకా అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే అందించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఉదయం పూట బలవర్ధకమైన టిఫిన్ కూడా అందించాలని నిర్ణయించారు. బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా ఎగ్ బిర్యానీ తదితర వంటకాలను కొత్త మోనూలో చేర్చనున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు. మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు నెలకు 30గుడ్లు, కౌమార దశలోనే అమ్మాయిలకు తృణ ధాన్యాలు, పల్లీలతో చేసిన చిక్కీలను రోజుకు ఒకటి చొప్పున నెలకు 30 చిక్కీలను అందించనున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు నేరుగా ఆయా ఆహార పదార్థాలను ఇంటికి పంపణి చేయనున్నారు.

మేకిరి దామోదర్,


95736 66650

Next Story