- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Pak Tensions: బార్డర్ లో పాక్ దుర్మార్గం .. పారిపోయే ప్రయత్నంలో మహిళ మృతి
బార్డర్ లో పాకిస్తాన్ దుర్మార్గానికి పాల్పడుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఆపరేషన్ సిందూర్‌తో (Operation Sindoor) చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ (Pakistan) భారత సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. సామాన్య పౌరులే లక్ష్యంగా విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతోంది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రజర్వానీ గ్రామం నుంచి వాహనంలో పారిపోవడానికి ప్రయత్నించిన ఓ కుటుంబంపై ఫిరంగి వచ్చిపడింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బారాముల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. అలాగే ఉరిలోని తాజల్ గ్రామంలో షెల్ పడిన ఘటనలో మరొక పౌరుడు గాయపడ్డాడు. మొహుర్రా, గింగల్, రాంపూర్ ప్రాంతంలో పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పాక్ దాడుల నేపథ్యంలో గత రాత్రి ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్ లోయ అంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే శ్రీనగర్‌లో గురువారం రాత్రే సరఫరాను పునరుద్ధరించగా, ఇవాళ ఉదయం లోయలోని ఇతర ప్రాంతాలలో పునరుద్ధరించారు.






