Field Marshal Sam Manekshaw: పాకిస్థాన్‌ను 13 రోజుల్లో యుద్ధంలో ఓడించిన ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా ఎవరు...ఆయన ఇందిరా గాంధీకి ఇచ్చిన సలహా ఏంటి?

by Vennela |

Field Marshal Sam Manekshaw: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రస్తుతం గతంలో భారత్ పాకిస్తాన్ తలబడిన వేళ జరిగిన చరిత్ర గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.

Field Marshal Sam Manekshaw: పాకిస్థాన్‌ను 13 రోజుల్లో యుద్ధంలో ఓడించిన ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా ఎవరు...ఆయన ఇందిరా గాంధీకి ఇచ్చిన సలహా ఏంటి?
X

దిశ, వెబ్ డెస్క్: Field Marshal Sam Manekshaw: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రస్తుతం గతంలో భారత్ పాకిస్తాన్ తలబడిన వేళ జరిగిన చరిత్ర గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి చారిత్రక సంఘటనలో కొంతమంది కీలకమైన వ్యక్తులు తారసపడుతుంటారు 1971 వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టింది. కేవలం 13 రోజుల వ్యవధిలోనే యుద్ధాన్ని ముగించి పాకిస్థాన్ ఓడించి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది.

ప్రపంచంలో ఇంత త్వరగా ఒక యుద్ధం ముగియడం అనేది ఇదే తొలిసారి అని అప్పటి మిలటరీ విశ్లేషకులు పేర్కొన్నారు. మరి కేవలం 13 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆయనే ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా (Sam Hormusji Framji Jamshedji Manekshaw), భారత సైన్యంలో అత్యున్నత పదవిని పొందిన తొలి అధికారి ఆయనే కావడం విశేషం. యుద్ధ రంగంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత ఆవశ్యకం. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో సామ్ మానిక్ షా కీలక పాత్ర పోషించారు.

పార్సీ కుటుంబానికి చెందిన ఆయన 1914 ఏప్రిల్ 3, పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. సైన్యంపై ఉన్న ఇష్టంతో ఆయన బ్రిటిష్ ఇండియా ఆర్మీలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైతం ఆయన పాలుపంచుకున్నారు. 1969 లో భారత సైన్యం చీఫ్ గా ఆయన సామ్ మానిక్ షా తర్వాత బంగ్లాదేశ్ యుద్ధ విజయం అనంతరం 1973లో ఫీల్డ్ మార్షల్‌గా నియామకం పొందారు

1971 యుద్ధం జరిగే ముందు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సామ్ మానిక్ షా ఒక సలహా కారణంగా భారత్ పాకిస్తాన్ పైన కేవలం 13 రోజుల వ్యవధిలో సులభంగా విజయం సాధించింది. పులి వేటాడే ముందు పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారేవరకు వేచి చూస్తుంది. అన్ని పరిస్థితులు అనుకూలం అయిన తర్వాతే ఒకే ఒక పంజాతో వేటాడే జంతువు ప్రాణం తీస్తుంది.

సరిగ్గా ఇదే సూత్రాన్ని ఆయన యుద్ధం విషయంలో కూడా అనుసరించాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సూచన చేశారు. బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న దురాగతాలకు చరమగీతం పలకాలని ఇందిరాగాంధీ అప్పటి సైన్యాధ్యక్షుడు సామ్ మానిక్ షాను యుద్ధ తంత్రం గురించి చర్చించగా... "I guarantee you victory, but I must decide the time and place." అని సామ్ మానిక్ షా అన్న మాటలు ఇందిరా గాంధీని ఆకర్షించాయి. ప్రస్తుతం మనం యుద్ధం చేసేందుకు మన సైన్యం సిద్ధంగా లేదు. వాతావరణం అనుకూలంగా లేదు...వర్షాకాలం తర్వాత సరైన సమయం ఆసన్నమై, తూర్పు బెంగాల్ నేలలు యుద్ధానికి అనుకూలంగా ఉంటాయన్నారు.

యుద్ధం చేయడం అంటే ఆవేశంతో ముందుకు దూసుకెళ్లడం కాదు. యుద్ధమైన, వేట అయినా ఆచితూచి సరైన సమయం సందర్భం చూసి మాటు వేసి ఓపికగా ఉంటూ తెలివిగా అడుగులు వేస్తేనే విజయం దక్కుతుదనేది ఆయన మాట.

Next Story