- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmos missile vs Babur missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణి Vs పాకిస్థాన్ బాబర్ క్షిపణి రెండింటిలో ఏది పవర్ ఎక్కువ..? ఎవరిది పైచేయి
Brahmos missile vs Babur missile: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Brahmos missile vs Babur missile: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ అమలులో ఉన్నప్పటికీ పాకిస్తాన్ తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతూ కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో శత్రుస్తావరాలపైన దాడికి దిగుతోంది. అయితే పాకిస్తాన్ వద్ద కూడా బ్రహ్మోస్ కు ధీటుగా బాబర్ క్షిపణి ఉందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ రెండు క్షిపణుల పోలిక చూద్దాం.
భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి సూపర్ సోనిక్ వేగంతో Mach 2.8 - 3 స్పీడుతో ప్రయాణిస్తుంది. ఇది శత్రుస్థావరాల పైన అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఢీకొడుతుంది. దీంతో శత్రువు ఎదురుదాడి చేసే అవకాశం ఉండదు. అలాగే దీని శ్రేణి 300 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. దీనిని సముద్రం పైనుంచి కానీ, నేలపై నుంచి కానీ, యుద్ధ విమానాల ద్వారా కానీ ప్రయోగించవచ్చు. శత్రు లక్ష్యాలను ఛేదించడంలో దీనికి అక్యురసీ ఎక్కువగా ఉంటుంది.
ఇక పాకిస్తాన్ అభివృద్ధి చేసిన బాబర్ క్రూయిజ్ క్షిపణి సబ్ సోనిక్ వేగతంతో ప్రయాణిస్తుంంది. దీని వేగం Mach 0.8 బ్రహ్మోస్ క్షిపణి వేగంతో పోల్చితే ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా సైలెంట్ గా ప్రయాణిస్తుంది. రాడార్లు కూడా దీని పసిగట్టలేవు. దీని రేంజ్ 450 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్లుగా ఉంది. బ్రహ్మోస్‌తో పోలిస్తే బాబుర్ అక్యూరసీ తక్కువగా ఉంటుంది. అయితే ఇది ల్యాండ్, నేవీ, ఎయిర్, సబ్‌మరీన్ నుండి ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంది.
మొత్తానికి ఈ రెండు క్షిపణులు ఇరుదేశాల అమ్ముల పొదిలో ఉన్నప్పటికీ భారత్ వద్ద ఉన్న బ్రాహ్మోస్ దే పై చేయి అని నిపుణులు సూచిస్తున్నారు.






