- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ ఆర్మీ చేసేది జీహాద్ కాదు.. వాళ్లు దొంగలు: తాలిబాన్
ఉగ్రవాద శిభిరాలను పేల్చేసిన భారత్ పై ప్రతీకార చర్యకు దిగిన పాకిస్తాన్ కు అడుగడున షాక్ తగులుతుంది. పాక్ సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ దాడి చేయగా.. భారత డిఫెన్స్ సిస్టం దీటుగా ఎదురుకొవడమే కాకుండా కోలుకోలేని దెబ్బ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాద శిభిరాలను పేల్చేసిన భారత్ పై ప్రతీకార చర్యకు దిగిన పాకిస్తాన్ కు అడుగడున షాక్ తగులుతుంది. పాక్ సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ దాడి చేయగా.. భారత డిఫెన్స్ సిస్టం దీటుగా ఎదురుకొవడమే కాకుండా కోలుకోలేని దెబ్బ కొట్టింది. అలాగే పాక్ ఏ మాత్రం సమయం ఇవ్వకుండా భారత దాడి చేయడంతో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికు ముందే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా.. దాదాపు సగానికి పైగా దేశాలు పాక్ కు మద్దతు ఇవ్వలేదు. తాజాగా మరో దేశం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిలిచింది. శుక్రవారం ఉదయం తాజా పరిస్థితులపై స్పందించిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) నేతలు సంచలన స్టేట్ మెంట్ విడుదల చేశారు.
భారత్, బలుచిస్తాన్ కు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న దాడులకు సహకరించొద్దని పస్తూన్ తెగల వారికి ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. పాక్ ఆర్మీ ఆటలో మనం పావులు కావొద్దనని పేర్కొంది. అలాగే పాక్ ఆర్మీ చేసేది జీహాద్ కాదు.. వాళ్లు దొంగలు అంటూ తాలిబాన్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో పాక్ ప్రస్తుతం ఏకాకిగా మారిపోయింది. ఇదిలా ఉంటే శత్రువుల వల్ల భారీ నష్టాలు సంభవించిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములకు మరిన్ని రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. పెరుగుతున్న యుద్ధం, స్టాక్స్ పతనం మధ్య, అంతర్జాతీయ భాగస్వాములు ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడాలని మేము కోరుతున్నాము. అని పాకిస్తాన్ ఆర్థిక విభాగం వరల్డ్ బ్యాంక్ ను ట్విట్టర్ ద్వారా కోరింది.






