Al Bakistan: బకిస్థాన్ అంటే ఏంటి..? పాకిస్థాన్ త్వరలోనే 4 ముక్కలు అవుతుందా..? పాక్‌‌లోని వేర్పాటు ఉద్యమాలు ఇవే..

by Vennela |

Al Bakistan: పాకిస్తాన్ త్వరలోనే నాలుగు ముక్కలు అవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Al Bakistan: బకిస్థాన్ అంటే ఏంటి..? పాకిస్థాన్ త్వరలోనే 4 ముక్కలు అవుతుందా..? పాక్‌‌లోని వేర్పాటు ఉద్యమాలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: Al Bakistan: పాకిస్తాన్ త్వరలోనే నాలుగు ముక్కలు అవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక్కొక్కటిగా ఇప్పటికే పెద్ద ఎత్తున వేర్పాటువాద నినాదాలు ఎక్కువవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంత నేతల వ్యవహార శైలే కారణమని విదేశాంగ నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు.

ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం పూర్తిగా నాలుగు ప్రాంతాలుగా విభజించబడి ఉంది. అవి బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్, పశ్చిమ పంజాబ్. వీటిలో పశ్చిమ పంజాబ్ మిగతా మూడు ప్రాంతాలపైన ఆధిపత్యం చెలాయిస్తుందని వాదన చాలా కాలంగా ఉంది. ఆర్థికంగాను రాజకీయంగాను ఈ ప్రాంతానికి చెందిన నేతలే అన్ని రంగాల్లోనూ పై చేయి సాధిస్తున్నారు. మిగతా ప్రాంతాలకు చెందినవారు దోపిడీకి, వివక్షకు గురవుతున్నామని చాలాకాలంగా తమ వాదన వినిపిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ ఏర్పాటు జరిగినప్పుడు, పశ్చిమ పంజాబ్ కేంద్రంగానే విభజన ఎక్కువగా జరిగింది.

పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతాన్ని బకిస్తాన్ అని పిలుస్తారు. ఇక్కడే అతిపెద్ద నగరాలు ఉన్నాయి లాహోర్ ఇందులో మెయిన్ సిటీగా చెప్పవచ్చు. ఇది పాకిస్తాన్ కు ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతానికి చెందిన నేతలే పాకిస్థాన్కు ఎక్కువగా ప్రధాని, మిలిటరీ జనరల్ వంటి పదవులను అలంకరించారు. ఈ నేపథ్యంలో మిగతా మూడు ప్రాంతాలకు చెందినవారు తమకు ప్రాతినిధ్యం కల్పించాలని తమకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ వాటిని బుట్ట దాఖలు చేస్తున్నారు.

మిలిటరీలో ఆధిపత్యం ఎక్కువగా పశ్చిమ పంజాబ్ ప్రాంతం వారిదే ఉంటుంది. దీంతో మిగతా ప్రాంతాల వారు తమకు ప్రాధాన్యత తగ్గడం లేదని ఇక వేరు దేశంగా ఏర్పడితేనే తమకు ఉనికి అనేది లభిస్తుందని అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ముక్కలు అయినట్లయితే నాలుగు ముక్కలు అయ్యే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్, పశ్చిమ పంజాబ్ దేశాలుగా విడిపోయే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో బలూచిస్తాన్ బలంగా పోరాటం చేస్తోంది. ఒకవేళ బలూచిస్థాన్ గనుక వేరు దేశంగా ఏర్పడితే మాత్రం. ఇక పాకిస్తాన్ నాలుగు ముక్కలు కావడం ఖాయమని, అందులోని పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్ గా మిగిలిపోతుందని ఇటీవల సీనియర్ రాజకీయ నేత సుబ్రహ్మణ్యస్వామి సైతం ట్వీట్ చేశారు.

Next Story