Indira Gandhi: పాకిస్థాన్ జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడి హుకూం.. కళ్లు మూసుకొని మౌనంగా భరించిన ఇందిర..1971 పాక్ తో యుద్ధానికి ముందు ఏం జరిగింది..?

by Vennela |

Indira Gandhi: ఇందిరాగాంధీని అపర కాళీ అని ఐరన్ లేడీ అని అంటారు. ఆమెకు ఆ బిరుదులు ఊరికే వచ్చినవి కాదని చరిత్రకారులు చెబుతున్నారు.

Indira Gandhi: పాకిస్థాన్ జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడి హుకూం.. కళ్లు మూసుకొని మౌనంగా భరించిన ఇందిర..1971 పాక్ తో యుద్ధానికి ముందు ఏం జరిగింది..?
X

దిశ, వెబ్ డెస్క్ : Indira Gandhi: ఇందిరాగాంధీని అపర కాళీ అని ఐరన్ లేడీ అని అంటారు. ఆమెకు ఆ బిరుదులు ఊరికే వచ్చినవి కాదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇందిరా గాంధీ నిజంగానే ఐరన్ లేడీ అనడానికి ఒక ఉదాహరణ గురించి గురించి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతల వేళ గుర్తు చేసుకోవచ్చు. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా ఇందిరా గాంధీ చూపించిన ధైర్య సాహసాలను ఆనాటి చరిత్రకారులు పుస్తకాల రూపంలో రచించారు. అందులో Gary J. Bass రచించిన The Blood Telegram చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు.

ఈ పుస్తకంలో తెలిపిన వివరాల ప్రకారం 1971లో బంగ్లాదేశ్ ఉద్యమానికి మద్దతుగా భారత్ పాకిస్తాన్ పై యుద్ధానికి దిగింది. అంతకుముందే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని అమెరికాకు పిలిపించి అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారని పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నారని. ఎందుకంటే చైనా-అమెరికా మధ్య సంబంధాల ఏర్పాటులో పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తోంది.

1971లో ఇందిరాగాంధీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ను కలిసేందుకు సమయానికే వైట్ హౌస్ వర్గాలు సూచించిన సమయానికే ఆమె అమెరికా అధ్యక్షుడు నివాస భవనం అయిన వైట్ హౌస్ వెళ్లి వేచి ఉన్నారు. కానీ అధ్యక్షుడు నిక్సన్ ఆమెను వేచి ఉండేలా చేశారు. చాలా ఆలస్యంగా వచ్చి ఆమెను కలిశారు. ఒక దేశ ప్రధాని అధికారిక నివాసానికి వచ్చినప్పుడు ఆమెను కావాలని వేచి ఉండేలా నిరీక్షణ చేయించడం అనేది "diplomatic slight" (రాజనీతి అవమానం)గా భావిస్తారు. కానీ ఇందిరాగాంధీ మౌనంగా ఉన్నారు.

ఇంతలో ప్రెసిడెంట్ నిక్సన్, విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ అత్యంత అవమానకరంగా ఇందిరా గాంధీతో మాట్లాడుతూ ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బంగ్లాదేశ్‌ విషయంలో జోక్యం చేయవద్దని, పాకిస్థాన్ జోలికి వెళ్లవద్దని హెచ్చరించాడు. అయితే ఇందిరా గాంధీ ఈ పరిణామాలపై తన ముఖంలో షాక్ అయినట్లు కనిపించకుండా నిబ్బరంగా ఉన్నారు. . ఆమెలో అసహనం ఉన్నప్పటికీ ముఖంలో కనిపించనివ్వలేదు అని పుస్తకంలో రాశారు. చివరకు ఆమె సాయంకాలం అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఏర్పాటుచేసిన అధికారిక విందులో పాల్గొని ఆ విందు మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నారు. అధికారిక ప్రసంగాన్ని కూడా ఆమె ఫ్రెంచ్ భాషలో చేశారు. ఈ పరిణామాలు నిక్సన్ కు అర్థం కాలేదు. సస

ఇది ఒకరకంగా ఇందిరాగాంధీ తన నిరసనను అమెరికా అధ్యక్షుడికి తెలియజేశారు. ఈ ఘటన 1971 నవంబర్ మాసంలో చోటుచేసుకుంది. అమెరికా నుంచి తిరిగి రాగానే ఇందిరాగాంధీ అగ్రరాజ్యం అమెరికాతో సహా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని ప్రారంభించారు. 1971 డిసెంబర్ 3న భారత సైన్యాలు బంగ్లాదేశ్ వైపు దూసుకెళ్లాయి మరోవైపు పాకిస్తాన్ గుండెకాయగా చెప్పే లాహోర్ వైపు కూడా భారత సైన్యాలు దూసుకెళ్లాయి. కేవలం 13 రోజుల్లోనే ప్రపంచంలోనే అత్యంత తక్కువ వ్యవధిలో భారత సైన్యాలు 1971 డిసెంబర్ 16న నాటికి పాకిస్తాన్ ను ఓడించాయి.

డిసెంబర్ 16, 1971న పాకిస్థాన్ జనరల్ ఏ.ఏ.ఖాన్ నియాజీ. అప్పటి భారత సేనాధిపతి లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ముందు లొంగిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులను భారత్ బందీలుగా పట్టుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఒక దేశానికి చెందిన సైన్యం లొంగిపోవడం ఇదే తొలి సంఘటనగా చెప్పవచ్చు. పాకిస్తాన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది. అమెరికా అధ్యక్షుడు చేసిన ఒక అవమానం కారణంగా ఇందిరాగాంధీ, భారతదేశానికి చేరుకొని పాకిస్థాన్ కు తన ఉగ్రరూపాన్ని చూపించారని ఆమె అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. ఈ దెబ్బతో అమెరికా కూడా భారత్ పాకిస్తాన్ వ్యవహారాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది.

Next Story