Operation Sidoor: భారత ఆత్మరక్షణ హక్కుకు మద్దతు ఇస్తున్నాం: ఇజ్రాయెల్ రాయబారి రూవెన్

by S Gopi |

అమాయకులపై ఉగ్రవాదులు చేసిన దారుణమైన నేరాల నుంచి దాక్కోవడానికి ఎక్కడా స్థలం లేదని వారు తెలుసుకోవాలి.

Operation Sidoor: భారత ఆత్మరక్షణ హక్కుకు మద్దతు ఇస్తున్నాం: ఇజ్రాయెల్ రాయబారి రూవెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్‌గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో దీన్ని నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదం నుంచి తమను తాము రక్షించుకునేందుకు భారత్‌కు ఆ హక్కు ఉందని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. ఈ విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతును ఇస్తున్న్నట్టు ఆ దేశ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'భారత్ ఆత్మరక్షణలో భాగంగా చేసిన దాడికి ఇజ్రాయెల్ మద్దతిస్తుంది. అమాయకులపై ఉగ్రవాదులు చేసిన దారుణమైన నేరాల నుంచి దాక్కోవడానికి ఎక్కడా స్థలం లేదని వారు తెలుసుకోవాలి. జమ్మూకశ్మీర్‌లో 26 మందిని అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న పెహల్‌గామ్ దాడికి కారణమైన, ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న శిబిరాలు, లాజిస్టిక్ హబ్‌లపై సైనిక దాడి సరైనదేనని' రూవెన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్ చేసిన ఆపరేషన్‌పై వివిధ దేశాల, సంస్థల ప్రతినిధులు సైతం స్పందించారు. 'రెండు దేశాలు సంయమనం పాటించాలని, భారత్, పాకిస్తాన్ సైనిక దాడులను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఏ దేశమైనా తీవ్రంగా ఖండిస్తుంది. అయితే, దీనిపై ప్రతీకార దాడి కారణంగా పూర్తిస్థాయిలో సైనిక దాడులకు దారితీస్తాయనే ఆందోళన తమకుంది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి కోసం ఇరు దేశాలు సంయమనం పాటించాలని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిమాసా హయాషి అన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించాలని, ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ముప్పు పెరగకుండా ఉండాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.

Next Story