పాక్ పై టీమిండియా ప్లేయర్ సీరియస్.. మాకు, మీకు తేడా ఇదేరా

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

పాక్ పై టీమిండియా ప్లేయర్ సీరియస్.. మాకు, మీకు తేడా ఇదేరా
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన పోస్ట్ పెట్టాడు. మేము ఉగ్రవాదులను మట్టికరిపిస్తుంటే.. మీరు మాత్రం వాళ్లను రక్షిస్తున్నారని... ఫైర్ అయ్యాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇదేరా మీకు, మాకు ఉన్న తేడా అంటూ రెచ్చిపోయాడు. మా దెబ్బకు మీ పని అయిపోయిందని.. చురకలు అంటించాడు.

యుద్ధం ఎప్పుడు వచ్చినా... విజయం మాత్రం ఇండియాదే అని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఏ మాత్రం డౌట్ లేదన్నాడు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.. శనివారం రోజు సాయంత్రం కాల్పుల విరమణకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఇది జరిగి నాలుగు గంటలు ముగియక ముందే.. పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని బయట పెట్టింది. దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇండియా ఏ మాత్రం తగ్గలేదు. వాళ్ల ఎత్తులకు పైఎత్తులు వేసి... అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసింది ఇండియా.


Next Story