- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమృత్‌సర్‌లో మళ్లీ మోగిన ఎయిర్ రైడ్ సైరన్.. అలర్ట్ అయిన సైన్యం
భారత సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన చర్యలు కొనసాగుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్:భారత సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్(Pakistan) కాల్పుల ఉల్లంఘన చర్యలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌పై డ్రోన్స్, మిస్సైల్స్‌లో ఎటాక్‌కు అక్కడి సైన్యం యత్నిస్తోంది. దీంతో భారత జవాన్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. పాక్ నుంచి వస్తున్న డ్రోన్ల(Drones)ను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటి వరకూ 40 నుంచి 50 వరకూ డ్రోన్స్ కూల్చివేసినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా అమృత్‌సర్(Amrutsar)లో ఎయిర్ రైడ్ సైరన్ మళ్లీ మోగింది. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎటు నుంచి దాడి చేసినా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పాక్ నుంచి వచ్చే డ్రోన్లు, మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పాక్ నుంచి వస్తున్న విపత్కర పరిస్థితులను గుర్తించి ముందుగానే ఎయిర్ రైడ్ సైరన్ మోగే విధానాన్ని భారత్ సైన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాక్ డ్రోన్లను చాలా ఈజీగా అడ్డుకుంటోంది.






