- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్.. మరో ఇద్దరు పాక్ సైనికులు మృతి
by Ajay Maddhiboyina |
ఇటీవల భారత్ చేసిన వైమానిక దాడుల్లో మరో ఇద్దరు మరణించినట్టు పాకిస్థాన్ వెల్లడించింది. భారత్ చేసిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహమ్మద్

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల భారత్ చేసిన వైమానిక దాడుల్లో మరో ఇద్దరు మరణించినట్టు పాకిస్థాన్ వెల్లడించింది. భారత్ చేసిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహమ్మద్ నవీద్ షాహిద్, ఆయాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారని, 78 మంది గాయపడ్డారని డీజీఐఎస్పీఆర్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మొదట పాకిస్థాన్ సైనికులు ఎవరూ భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించలేదని దాయాది దేశం అసత్య ప్రచారం చేసింది. కానీ పాక్ పై భారత్ చేసిన దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేయడంతో నిజాలు ఒప్పుకుంటోంది. అంతే కాకుండా మొదట కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ భారత్ వారి డ్రోన్లను నేలమట్టం చేసిన తరవాత తోకముడిచింది.
Next Story






