- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ceasefire: ట్రంప్ వ్యాఖ్యలు కశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నమే: కాంగ్రెస్
కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నమేనని కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ విమర్శించారు. భారత సాయుధ దళాలు తాము ఎవరికీ తీసిపోమని నిరూపించాయి. కానీ గడిచిన 24 గంటల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయని కాల్పుల విరమణను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడం ఆశ్చర్యపరిచిందన్నారు. ఇవాళ ఏఐసీసీ హెడ్ క్వార్టర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం మొదటిసారి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించి 1994 నాటి తీర్మానాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1971 యుద్ధ సమయంలో అమెరికా ఒత్తిడి చేసినా నాటి ప్రధాని ఇందిరా గాంధీ వాటిని అధిగమించారని గుర్తు చేశారు. పార్లమెంట్ దాడి సమయంలో అటల్ బిహార్ వాజ్ పేయ్ ప్రధానిగా సోనియా గాంధీ ఎల్ఓపీగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ప్రభుత్వంతో ఉందని చెప్పారు. జాతీయ భద్రత నేపథ్యంలో ఇప్పుడు కూడా ప్రతిపక్షం ప్రభుత్వంతో ఉందని చెప్పారు. కానీ అమెరికా కాల్పుల విరమణ ప్రకటించిన విధానం ద్వైపాక్షిక సమస్యను అంతర్జాతీయీకరించే ప్రయత్నం అని విమర్శించారు.






